భారతదేశం, జూలై 2 -- ఇటీవల ఏదైనా కొనేందుకు క్రెడిట్ కార్డులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. క్రెడిట్ కార్డు చెల్లింపులు కావాలంటే ఈఎంఐ ద్వారా చేసుకోవచ్చు. దీంతో ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొంతమంది అధిక క్రెడిట్ లిమిట్ కావాలి అనుకుంటారు. మీ క్రెడిట్ పరిమితిని ఎలా పెంచుకోవాలో మీకు కూడా గందరగోళం ఉండవచ్చు. మన క్రెడిట్ పరిమితిని పెంచడం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఇది సమస్యలను కూడా కలిగిస్తుందని గుర్తుంచుకోవాలి. మనం పెంచే ఏదైనా క్రెడిట్ పరిమితిని ఎలా నిర్వహించాలో తెలుసుకోవాలి.

క్రెడిట్ కార్డులో మీకు కావలసినంత డబ్బును ఉపయోగించవచ్చు. కానీ కొంతమంది తమ క్రెడిట్ లిమిట్ పెంచుకోవాలని అనుకుంటారు. ఇది వారికి పెద్ద మొత్తంలో వస్తువులను కొనడానికి డబ్బును ఇస్తుంది. ఇది వారికి అత్యవసర ఖర్చులను తీర్చడానికి లేదా అందుబాటులో ఉన్న ఉత్తమ ఆఫర్‌లను సద్వినియోగం చ...