భారతదేశం, నవంబర్ 16 -- గత కొన్నేళ్లుగా మన దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగింది. సులువుగా కార్డులు మంజూరు అవుతుండటం, ఆకర్షణీయమైన రివార్డు వ్యవస్థలు, వినియోగదారుల ఖర్చు పెరగడం దీనికి ప్రధాన కారణాలు. అయితే ఈ పెరుగుదలతో పాటు ఒక సాధారణ ఆందోళన కూడా పెరుగుతోంది! అది.. క్రెడిట్ కార్డులు అనేవి వినియోగదారులు, వారి కుటుంబాలకు 'అప్పుల ఊబి'గా మారుతున్నాయా?

ఈ ప్రశ్నకు సమాధానం అంత సులభం కాదు. ప్రాథమికంగా, క్రెడిట్ కార్డులు వాడేవారు ఈ రుణ సాధనాలను ఎలా ఉపయోగిస్తున్నారు అనే దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. నష్టాలను అంచనా వేయడానికి, ఆర్థికంగా సురక్షితంగా ఉండటానికి మీకు సహాయపడే స్పష్టమైన విశ్లేషణను ఇక్కడ తెలుసుకోండి..

క్రెడిట్ కార్డులు ప్రమాదకరంగా మారడానికి కారణమయ్యే అంశాలు:

అధిక వడ్డీ రేట్లు: గడువు ముగిసిన తర్వాత బకాయిలను క్యారీ ఫార్వర్డ్ చేస్తే, దేశ...