భారతదేశం, జూన్ 30 -- వేతన జీవుల్లో చాలా మంది ఇప్పుడు క్రెడిట్​ కార్డ్​లు ఉపయోగిస్తున్నారు. బ్యాంకులు కూడా క్రెడిట్​ కార్డ్​లు ఇచ్చేందుకు ఎగబడుతున్నాయి. అయితే, మితిమీరిన వినియోగం వల్ల క్రెడిట్​ కార్డ్​ హోల్డర్లు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా చాలా మంది క్రెడిట్​ కార్డ్​ స్టేట్​మెంట్​ కూడా చదవడం రావడం లేదు! ఇది సరైనది కాదు. ఈ నేపథ్యంలో అసలు క్రెడిట్​ కార్డ్​ స్టేట్​మెంట్​ అంటే ఏంటి? అందులో ఏముంటాయి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? వంటి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మీ బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డ్ జారీ చేసే సంస్థ మీకు ప్రతి నెలా ఒక క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను పంపుతుంది. ఇందులో నిర్దిష్ట బిల్లింగ్ సైకిల్‌కు సంబంధించిన మీ బకాయిలు, చెల్లింపులు, లావాదేవీలన్నీ ఉంటాయి. ప్రాథమికంగా, ఇది మీకు చెల్లింపులు...