భారతదేశం, నవంబర్ 28 -- టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ, మన దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం పెరుగుతోంది. అదే సమయంలో కార్డులకు సంబంధించిన మోసాలు కూడా పెరుగుతుండటం ఆందోళనకర విషయం. డిజిటల్ టెక్నాలజీ వేగంగా విస్తరించడం, సులభంగా కార్డు దరఖాస్తులు ఆమోదించిడటం దీనికి ప్రధాన కారణం.

ఇలాంటి పరిస్థితుల్లో క్రెడిట్ కార్డుదారుడి మొబైల్‌కు వచ్చే ఒక్క అనధికార లావాదేవీ లేదా డెబిట్ మెసేజ్ కూడా తీవ్రమైన ఆర్థిక, మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. నష్టాన్ని తగ్గించుకోవడానికి, సకాలంలో పరిష్కారం పొందడానికి ఇలాంటి సందర్భాలలో తక్షణమే, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం చాలా ముఖ్యం.

ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. అనధికార లావాదేవీలకు క్రెడిట్ కార్డుదారులకు జీరో లయబిలిటీ ఉంటుంది. అయినప్పటికీ, ఈ జీరో లయబిలిటీ అనేది మోసం జరిగిన విషయాన్ని నిర్దేశిత సమయాల్లో సరిగ్గా రిపోర్ట్ చ...