భారతదేశం, ఆగస్టు 6 -- భారత ఎస్‌యూవీ మార్కెట్‌లో హ్యుందాయ్ క్రెటా హవా కొనసాగుతోంది. పదేళ్లుగా ఈ కారు తన అగ్రస్థానాన్ని కాపాడుకుంటోంది. పోటీ ఎంత పెరిగినా, కొత్త మోడళ్లు ఎన్ని వచ్చినా, క్రెటా తన స్థానాన్ని ఏమాత్రం కోల్పోలేదు. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు దేశవ్యాప్తంగా 1,17,458 క్రెటా కార్లు అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 8% పెరుగుదల కావడం విశేషం.

నిజానికి, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి కొత్త కార్లు మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత మధ్యస్థాయి ఎస్‌యూవీల విభాగంలో పోటీ బాగా పెరిగింది. అయినా, క్రెటా అమ్మకాలు తగ్గలేదు. గత జూన్‌లో ఏకంగా 15,786 క్రెటా యూనిట్లు అమ్ముడయ్యాయి. దీంతో, వరుసగా మూడో నెలలోనూ దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది.

మరి ఇంతమందిని క్రెటా ఎందుకు ఆకట్టుకుంటోంది? దాన...