Andhrapradesh, ఆగస్టు 30 -- రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికే 3 శాతం స్పోర్ట్స్ కోటా అమలు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. 'బ్రేకింగ్ బౌండరీస్ విత్ నారా లోకేష్' పేరిట భారత మహిళా క్రికెటర్లతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... క్రీడలను ప్రోత్సహించడంలో చంద్రబాబాబుకు ప్రత్యేకమైన చరిత్ర ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాబోయే పదేళ్లలో క్రీడల అభివృద్ధికి ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపడతామని తెలిపారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు యోగాంధ్ర కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించామని గుర్తు చేశారు. గ్రాస్ రూట్ లెవల్ లో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. అయితే క్రీడల్లో బాలికలను ప్రోత్సహించే విషయంలో తల్లిదండ్రుల మైండ్...