భారతదేశం, డిసెంబర్ 23 -- వేలాంకణి చర్చిలో క్రిస్‌మస్‌ ఉత్సవాలకు హాజరయ్యే వారికోసం దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించింది. 07407 ప్రత్యేకరైలు 23న అంటే మంగళవారం రాత్రి 7.25గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి.. బుధవారం సాయంత్రం 5.30గంటలకు వేలాంకణి చేరుకుంటుంది.

ఇక తిరుగు ప్రయాణంలో 07408 స్పెషల్ రైలు.. 25న గురువారం ఉదయం 8గంటలకు వేలాంకణిలో బయలుదేరుతుంది. శుక్రవారం ఉదయం 6.10గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుందని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.

ఈ ప్రత్యేక రైళ్లు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడురు, చెన్నై, తంబారం, చెంగలపట్టు, మేల్మరువత్తూర్, విల్లుపురం, తిరుప్పులియూర్, చిదంబరం, మయిలదుతురై, కరైకల్, నాగోర్, నాగపట్నం స...