భారతదేశం, డిసెంబర్ 25 -- చలి గిలిగింతలు పెడుతున్న వేళ.. క్రిస్మస్ పండుగ సందడి మొదలైపోయింది. ఈ డిసెంబర్ 25న మీ ఇంట్లో పండుగ వాతావరణాన్ని మరింత రెట్టింపు చేయడానికి ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్ ఒక అద్భుతమైన ఐడియాతో వచ్చారు. మనసును ఆహ్లాదపరిచే, ఆరోగ్యానికి మేలు చేసే కోకో పౌడర్‌తో తయారుచేసే 3 రకాల హాట్ చాక్లెట్ రెసిపీలను ఆయన పంచుకున్నారు.

"హాట్ చాక్లెట్ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు.. అది మన మూడ్‌ని ఇన్స్టంట్‌గా మార్చేసే ఒక మ్యాజిక్ డ్రింక్" అని చెఫ్ కునాల్ పేర్కొన్నారు. మరి ఆయన సూచించిన ఆ మూడు స్పెషల్ రెసిపీలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కాఫీ షాపుల్లో దొరికే విధంగా చిక్కగా, నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉండే హాట్ చాక్లెట్ ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. దీనికి మొక్కజొన్న పిండి (Cornstarch) వాడటం ఒక సీక్రెట్ టిప్.

కావలసినవి: పాలు (3 కప్పుల...