భారతదేశం, డిసెంబర్ 18 -- రాబోయే క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సైబర్ మోసగాళ్ళు పండుగ సీజన్లను ఆసరాగా చేసుకుని కొత్త పద్ధతుల ద్వారా మోసం చేస్తారని తెలిపారు. అమాయక పౌరులను మోసం చేయడానికి ఆన్‌లైన్‌ను ఉపయోగిస్తారని, ప్రజలు అదనపు అప్రమత్తంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కోరారు. సైబర్ మోసగాళ్ళు బాధితులను సంప్రదించేందుకు క్రిస్మస్ లేదా నూతన సంవత్సర గిఫ్ట్స్, విదేశీ లాటరీ, క్యాష్ బ్యాక్ గెలిచారని మెసేజులు పంపిస్తారు. ప్రాసెసింగ్ ఫీజులు లేదా వ్యక్తిగత వివరాలను అడుగుతారు.

మోసగాళ్ళు నూతన సంవత్సర పార్టీలు, ఈవెంట్స్, పబ్‌లు, రిసార్ట్‌లకు నకిలీ పాస్‌లను వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా పేజీల ద్వారా విక్రయిస్తారు. ఆకర్షణీయమైన హాలిడే ప్యాకేజీలు, తీర్థయాత్ర యాత్రలు, క్రూయిజ్ టూర్‌లు, అంతర్జాతీయ ...