భారతదేశం, నవంబర్ 12 -- క్రిస్పీగా, కరకరలాడే ఆహారాన్ని తినాలని ఉందా? అది కూడా నూనె ఎక్కువగా లేకుండా? అలాంటి ఆహార ప్రియుల కోసం ఎయిర్ ఫ్రైయర్‌లు (Air Fryers) ఒక అద్భుతమైన సాధనం. ఈ ఫ్రైయర్‌లు సూపర్-ఛార్జ్డ్ కన్వెక్షన్ ఓవెన్‌ల (Supercharged convection ovens) మాదిరిగా పనిచేస్తాయి. ఇవి వేడి గాలిని ఉపయోగించి, చాలా తక్కువ లేదా అసలు నూనె వాడకుండానే ఆహారానికి కరకరలాడే రూపాన్ని, రుచిని అందిస్తాయి.

మరి ఎయిర్ ఫ్రైయర్‌లో ఏం చేయవచ్చు? అనే ప్రశ్నకు సమాధానంగా.. ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ తన నవంబర్ 4 బ్లాగ్‌లో ఎయిర్ ఫ్రైయర్ రెసిపీలను పంచుకున్నారు. కొత్తగా ఎయిర్ ఫ్రైయర్ వాడేవారి కోసం సులభమైన రెసిపీలతో పాటు, మీకు ఇష్టమైన వంటకాలను నూనె లేకుండా ఎలా ఆస్వాదించాలో వివరించారు.

నోరూరించే ఆలూ ప్యాజ్ కుల్చా (Aloo Pyaz Kulcha) నుండి హెల్తీ, రుచికరమైన వెజ్జీ టోర్టిల్లా ...