భారతదేశం, జనవరి 2 -- ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇంగ్లండ్‌తో సిడ్నీ వేదికగా జరగనున్న ఐదో యాషెస్ టెస్టు తన కెరీర్‌లో చివరి మ్యాచ్ అని శుక్రవారం (జనవరి 2) ప్రకటించాడు. 39 ఏళ్ల ఖవాజా తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ నిర్ణయాన్ని వెల్లడిస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు.

ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్‌లో కీలక పాత్ర పోషించిన ఎడమచేతి వాటం బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా తన సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో జరిగే మ్యాచ్‌తో తాను జెర్సీని వదిలేస్తున్నట్లు తెలిపాడు.

రిటైర్మెంట్ ప్రకటన చేస్తూ ఖవాజా ఎమోషనల్ అయ్యాడు. "సిడ్నీ టెస్టు తర్వాత అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నాను. క్రికెట్ ద్వారా దేవుడు నేను ఊహించిన దానికంటే ఎక్కువే ఇచ్చాడు. ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలను, ఆటను మించిన ...