భారతదేశం, మే 12 -- టెస్టులకు అనూహ్యంగా రిటైర్మెంట్​ ప్రకటించి, యావత్​ క్రికెట్​ ప్రపంచాన్ని షాక్​కి గురిచేశాడు విరాట్​ కోహ్లీ. కింగ్​ కోహ్లీ ప్రకటన తర్వాత చాలా మంది.. "ఇక టెస్ట్​ క్రికెట్​ చూడటం ఆపేస్తాము," అని సోషల్​ మీడియా వేదికగా తమ ఎమోషన్స్​ని షేర్​ చేసుకుంటున్నారు. అది.. ఒక కెప్టెన్​గా, ఒక బ్యాటర్​గా టెస్ట్​ క్రికెట్​లో కోహ్లీ చేసిన మ్యాజిక్​! దిల్లీలోని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి వన్​ అఫ్​ ది బెస్ట్​ క్రికెటర్​గా కోహ్లీ ఎదిగిన తీరు.. నిజంగా స్ఫూర్తిదాయకం. కోహ్లీ హార్డ్​వర్క్​తో అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా మారిపోయింది. విరాట్​ కోహ్లీ రిటైర్మెంట్​ నేపథ్యంలో అతని నెట్​ వర్త్​, బిజినెస్​ వెంచర్ల గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

దిల్లీలో పుట్టిన విరాట్​ కోహ్లీ తండ్రి పేరు ప్రేమ్​ నాథ్​ కోహ్లీ. ఆయన ఒక లాయర్​...