భారతదేశం, జనవరి 16 -- ప్రముఖ నటి ఖుషీ ముఖర్జీ చిక్కుల్లో పడింది. టీమిండియా స్టార్ క్రికెటర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆమె మెడకు చుట్టుకున్నాయి. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైజాన్ అన్సారీ.. జనవరి 13న ఆమెపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశాడు.

ఇటీవల ఒక పబ్లిక్ ఈవెంట్‌లో ఖుషీ ముఖర్జీ మాట్లాడుతూ.. "చాలా మంది క్రికెటర్లు నా వెంట పడ్డారు. సూర్యకుమార్ యాదవ్ కూడా నాకు గతంలో చాలా మెసేజ్‌లు చేసేవాడు. ఇప్పుడు మేం పెద్దగా మాట్లాడుకోవడం లేదు. నాకు ఎవరితోనూ లింక్ అప్స్ వద్దు" అని కామెంట్ చేసింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సూర్యకుమార్ అభిమానులు మండిపడ్డారు. జాతీయ స్థాయి క్రీడాకారుడిపై ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని విమర్శించారు.

ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీ...