భారతదేశం, అక్టోబర్ 31 -- మహ్మద్‌ అజహరుద్దీన్‌.. ఓ నాటి టీంఇండియా సూపర్ స్టార్ క్రికెటర్. తన మణికట్టు మాయాజాలంతో ప్రపంచ క్రికెట్ అభిమానులను మంత్రముగ్ధుల్ని చేశాడు. భారత జట్టుకు సారథ్యం కూడా వహించి.. అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా నిలిచారు.

అత్యుత్తమ వన్డే బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా పేరొందిన ఆజారుద్దీన్.. 1985 క్రికెట్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడిగా కూడా ఉన్నాడు. అలాంటి అజారుద్దీన్.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. ఎంపీగా కూడా గెలిచిన ఆయన.. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో మంత్రిగా అవకాశం దక్కించుకున్నాడు.

కేబినెట్ విస్తరణలో భాగంగా శుక్రవారం (అక్టోబర్ 31) రాజ్ భవన్ లో ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. ఓసారి ఎంపీగా కూడా గెలిచిన ఆయన. ఎమ్మెల్యేగా మాత్రం పోటీ చేసి ఓడిపోయాడు. తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను గవర్నర్ కోటా...