భారతదేశం, ఏప్రిల్ 18 -- భారత మాజీ ఆల్‌రౌండర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. లైంగిక వేధింపులకు గురయ్యానని వెల్లడించి బాంబ్ పేల్చింది. ప్రముఖ క్రికెటర్లు తనకు నగ్న చిత్రాలు పంపారని సంచలన ఆరోపణలు చేసింది. ఓ వెటరన్ క్రికెటర్ తనతో పడుకోవాలని కోరుకుంటున్నానని చెప్పాడని ఆమె పేర్కొంది. అనయ బంగర్ లింగ (జెండర్) మార్పిడి ఆపరేషన్ చేయించుకుని అబ్బాయి నుంచి అమ్మాయిగా మారింది.

హార్మోన్ రిప్లేస్‌మెంట్ థెరపీ, లింగ పునర్నిర్మాణ శస్త్రచికిత్స తర్వాత తన లుక్ గురించి మాట్లాడిన అనయ.. ద లలన్ టాప్ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టింది. మొదట ఆర్యన్ గా పెరిగిన ఆమె.. అబ్బాయితో కలిసి ఏజ్ గ్రూప్ క్రికెట్ కూడా ఆడింది.

"నేను ఎనిమిది లేదా తొమ్మిది ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అమ్మ దుస్తులు తీసుకుని వేసుకునేదాన్ని. అద్దంలో చూసుకుని 'నేను అమ్మాయిని. ...