భారతదేశం, అక్టోబర్ 29 -- మొంథా తీవ్ర తుఫాన్ దాటికి ఏపీ వణికిపోతోంది. గడిచిన మూడు నాలుగు రోజులుగా తీరంలో అలలు తీవ్రస్థాయిలో ఎగిసిపడుతున్నాయి. తీవ్ర తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా. విద్యా సంస్థలు కూడా మూసివేశారు. మంగళవారం రాత్రి మొంథా తీవ్ర తుఫాన్ తీరాన్ని తాకగా. క్రమంగా బలహీనపడుతోంది. ప్రస్తుతానికి తీవ్ర తుఫాన్.. తుపానుగా బలహీనపడిందని వాతావరణశాఖ పేర్కొంది.

రానున్న 6 గంటల్లో తుఫాన్.. తీవ్ర వాయుగుండంగా బలహీన పడే అవకాశం ఐఎండీ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. కోస్తాంధ్రలో ఈదురుగాలులు వీస్తుండగా. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొన్న వివరాల ప...