భారతదేశం, ఏప్రిల్ 17 -- 2025 మార్చితో ముగిసినన గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నికర లాభం తగ్గింది. క్యూ4 లో ఇన్ఫోసిస్ ఏకీకృత నికర లాభం 11.75 శాతం క్షీణించి రూ.7,033 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.7,969 కోట్లుగా ఉంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం 8 శాతం పెరిగి రూ.37,923 కోట్ల నుంచి రూ.40,925 కోట్లకు పెరిగింది.

''ఆదాయం, నిర్వహణ మార్జిన్ల విస్తరణ, అత్యధిక ఉచిత నగదు ఉత్పత్తి పరంగా ఈ ఏడాది మా పనితీరు పటిష్టంగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, డిజిటల్లో మా లోతు, కాస్ట్ ఎఫిషియెన్సీ, ఆటోమేషన్, కన్సాలిడేషన్లో బలం మా క్లయింట్ల అవసరాలకు బాగా సరిపోతాయి" అని ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ సలీల్ పరేఖ్ అన్నారు. ఇన్ఫోసిస్ మార్చి త్రైమాసిక స్కోర్కార్డులోని ఐద...