భారతదేశం, ఏప్రిల్ 25 -- రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ జనవరి-మార్చి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ లాభంలో 6 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆయిల్-టు-కెమికల్స్ వ్యాపారంలో ఆశించిన ఫలితాలు రానప్పటికీ, రిటైల్ విభాగంలో పుంజుకోవడం, టెలికాంలో మెరుగైన వసూళ్లు సాధించడంతో మార్కెట్ అంచనాలను మించగలిగింది.

2025 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (Q4FY25) రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.22,434 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్జించిన నికర లాభం రూ.21,143 కోట్లు. కాగా, ఈ క్యూ 4 లో రిలయన్స్ రూ.18,471.4 కోట్ల నికర లాభాలను ఆర్జిస్తుందని బ్లూమ్ బర్గ్ పోల్ విశ్లేషకులు ఏకాభిప్రాయంగా అంచనా వేశారు.

రిలయన్స్ కన్సాలిడేటెడ్ ఆదాయం ఈ క్యూ 4 లో పదో వంతు పెరిగి రూ.2.65 ట్రిలియన్లకు చేరుకుంది. మార్కెట్ ఏకాభిప్రాయ అంచనా 2...