Hyderabad, సెప్టెంబర్ 29 -- అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి సోమవారం (సెప్టెంబర్ 29) తన పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ ద్వారా బర్త్ డే విషెస్ చెప్పాడు. ఈ సందర్భంగా ఆమెతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను కూడా షేర్ చేశాడు. ఈ ఫొటోలు, అతడు చెప్పిన విషెస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్ తను, స్నేహా ఒకేలాంటి మోనోక్రోమ్ డ్రెస్సులలో టూరిస్ట్‌ల లాగా పోజులిచ్చిన రెండు ఫొటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బ్లాక్ జాకెట్స్, సన్‌గ్లాసెస్, టీ-షర్ట్స్ ప్యాంట్స్‌లో ఉన్న ఈ జంట నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చింది. ఆ ఫొటోలను బన్నీ షేర్ చేస్తూ.. "హ్యాపీ బర్త్‌డే క్యూటీ" అని రాయడం విశేషం.

ఈ పోస్ట్ కు అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్, నటి అయిన లక్ష్మీ మంచు కూడా "హ్యాపీ బర్త్‌డే లవ్" అని కామె...