Hyderabad, ఏప్రిల్ 30 -- క్యాన్సర్ స్టేజ్ గురించి చికిత్సకి ముందే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే వైద్యులు క్యాన్సర్ ఉందో లేదో నిర్ధారణ చేసుకున్న తర్వాత అది ఏ స్టేజ్ లో ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు.

క్యాన్సర్ స్టేజింగ్ అంటే ఏమిటి? శరీరంలో క్యాన్సర్ ఏ మేరకు వ్యాప్తి చెందింది? కణితి పరిమాణం ఎలా ఉంది? అనేది తెలుసుకోవడమే. దాన్నిబట్టే వారు చికిత్స చేయడం ప్రారంభిస్తారు. చికిత్సను ప్రారంభించాలంటే క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉందో తెలుసుకోవాలి.

క్యాన్సర్ స్టేజింగ్ అంటే ఒక వ్యక్తి శరీరంలో ఎంత మేరకు క్యాన్సర్ ఉంది అని కనిపెట్టే ఒక ప్రక్రియ. ఇది రోగ నిర్ధారణకు చికిత్సకు ఉపయోగపడుతుంది. ఈ క్యాన్సర్ స్టేజిలో భాగంగా కణితి పరిమాణం ఎంత ఉంది? క్యాన్సర్ సమీపంలో ఉన్న శోషరస కణుపులకు ఇది వ్యాపించిందా? లేదా? శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించిందా? వంటివి కనుగొ...