భారతదేశం, ఏప్రిల్ 15 -- క్యాన్సర్ అనేది ఒక తీవ్రమైన వ్యాధి. శరీరంలోని కొన్ని కణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోతూ, ఆరోగ్యకరమైన కణాలను చనిపోవడం వల్ల వచ్చే సమస్యే క్యాన్సర్. క్యాన్సర్ కణాలు ఒకే చోట పరిమితం కాకుండా, శరీరంలోని ఇతర భాగాలకి కూడా వ్యాపిస్తాయి. మన శరీరానికి కనిపించని కవచం లాంటి రోగనిరోధక వ్యవస్థపై కూడా ఈ కణాల ప్రభావం గణనీయంగా ఉంటుంది. అనేక రకాల వైరస్‌లు, బ్యాక్టీరియా, ఫంగస్‌లు వంటి హానికర సూక్ష్మజీవులను నుంచి శరీరాన్ని రక్షించే బాధ్యతను రోగనిరోధక వ్యవస్థ నిర్వహిస్తుంది. ఇది బలంగా ఉంటేనే మనం చిన్న చిన్న జలుబు వంటి సమస్యల నుండి పెద్ద వ్యాధుల దాకా తట్టుకోగలుగుతాం.లేదంటే ప్రతి చిన్న దానికి డీలా పడిపోతాం.

సాధారణంగా మన శరీరం ప్రమాదకరమైన కణాలను గుర్తించి వాటిని తొలగిస్తుంది. కానీ క్యాన్సర్ కణాలు చాలా తెలివిగా ఉంటాయి. అవి ఆరోగ్యకరమైన కణాల్...