Hyderabad, ఏప్రిల్ 14 -- కీమోథెరపీ అనేది శరీరంలో వేగంగా పెరుగుతున్న క్యాన్సర్ కణాలను చంపడానికి ఉపయోగించే ఒక ఔషధ చికిత్స. క్యాన్సర్ కణాలు శరీరంలో ఇతర కణాలతో పోలిస్తే చాలా త్వరగా పెరుగుతాయి. అలా హై గ్రేడ్ క్యాన్సర్ బారిన పడిన వారికి కీమోథెరపీని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ కీమోథెరపీలో భాగంగా చాలా మందులు అందుబాటులో ఉంటాయి.

కీమోథెరఫీ అనేది అనేక రకాల క్యాన్సర్ల చికిత్సకు ప్రభావంతమైన మార్గం. అయితే కీమోథెరపీ చేసుకున్న వారిలో ఎన్నో సైడ్ ఎఫెక్టులు కూడా ఉంటాయి. వాటిని తట్టుకోవడం కూడా కష్టంగా ఉంటుంది.

ఏ కీమోథెరపీని క్యాన్సర్ కు చికిత్సగా మొదలు పెడతారు. శస్త్రచికిత్స చేసిన తర్వాత లేదా ఇతర చికిత్సలు చేసిన తర్వాత శరీరంలో ఎక్కడైనా మిగిలి ఉన్న క్యాన్సర్ కణాలను చంపడానికి ఈ కీమోథెరపీ పద్ధతిని ఎంచుకుంటారు. దీన్ని వైద్యులు సహాయక చికిత్సగా చెప్పుకుంటారు. అలాగే ...