Hyderabad, ఏప్రిల్ 12 -- క్యాన్సర్ చికిత్స అనేది కేవలం మెడికల్ ట్రీట్మెంట్‌ కోసమేనని పరిగణించొద్దు. ఇది మానసిక, శారీరకంగా ప్రభావం చూపించి భావోద్వేగాలలో మార్పు తీసుకొస్తుంది. ఇటువంటి సమయంలో వ్యాయామం చేయడం అనేది అసాధారణంగా అనిపించినా, చిన్నపాటి ఫిజికల్ యాక్టివిటీ కూడా శక్తిని, ధైర్యాన్ని అందించి బలం నిండేలా చేస్తుంది.

వ్యాయామం చేయడం వల్ల చిన్నపాటి నెగెటివ్ ఫీలింగ్స్ కలిగినా, శరీరాన్ని మెల్లగా కదిలించడ వల్ల ట్రీట్మెంట్‌లో మెరుగైన ఫలితాలు వస్తాయట. వ్యాయామం వల్ల ఇంకా ఏమేం ఉపయోగాలున్నాయో తెలుసుకుందాం.

ట్రీట్మెంట్ సమయంలో కొంతమంది బరువు తగ్గుతారు. మరికొంతమంది బరువు పెరుగుతారు. వ్యాయామం చేయడం వల్ల ఈ రెండింటినీ సమతుల్యం చేస్తుంది.

గుండె ఆరోగ్యానికి, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి వ్యాయామం సహాయపడుతుంది. వ్యాయామం చేయడం వల్ల శరీరానికి ఆక్సిజన్ సరఫరా మెరు...