Hyderabad, మార్చి 6 -- క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను అడ్డుకోవడానికి మందులను కనిపెట్టే పనిలో పరిశోధకులు బిజీగా ఉంటారు. అలా క్యాన్సర్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు ఎప్పటినుంచో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం కృషి చేస్తోంది. ఇప్పుడు ఒక పరిశోధన అత్యద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది. ఇది క్యాన్సర్ రోగులకు ఆశాకిరణమని చెప్పుకోవాలి. చవకగా దొరికే ఆస్పిరిన్ టాబ్లెట్ క్యాన్సర్ వ్యాప్తిని నివారించడంలో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కేంద్ర విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో ఆస్పిరిన్ శరీరంలోని రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసి క్యాన్సర్‌తో పోరాడేందుకు సహాయపడుతుందని కనిపెట్టారు. అయితే అలా అని క్యాన్సర్ ఉన్న వారంతా ఆస్పిరిన్‌ను వేసుకోకూడదని వైద్యుల్ల సూచన మేరకే వాడాలని కూడా చెబుతున్నారు.

క్యాన్సర్ కణాలు కణితుల్లా ఏర్పడతాయి. కొన్ని కణా...