Hyderabad, ఏప్రిల్ 14 -- క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధే. కానీ, అన్ని సార్లు ఇప్పటికే చాలా మంది క్యాన్సర్‌తో పోరాడి విజయం సాధించారు. చాలా మందికి క్యూర్ అవుతుందని తెలిసినా, క్యాన్సర్ వచ్చిందని తెలియగానే డీలా పడిపోతుంటారు. అటువంటి సమయంలో వారికి స్వాంతన కావాలి. ఏ చిన్న ఓదార్పు దొరికినా కొండంత ఊరటగా అనిపిస్తుంది. మీ బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఎవరైనా క్యాన్సర్ బారిన పడితే జాలిపడుతూ కూర్చోకండి. మీ వంతు సాయంగా మనోధైర్యాన్నిచ్చే విధంగా ఇలా ప్రవర్తించండి.

అందుబాటులో ఉంటే సరిపోతుందని అనుకోవద్దు. ఎందుకంటే, అందుబాటులో ఉండటం కంటే పక్కనే ఉండి సాంత్వన ఇచ్చేలా ప్రవర్తించడం వేరేలా ఉంటుంది. వాళ్లతో కూర్చొనండి, మౌనంగా ఉన్నా పరవాలేదు. మీ శాంతంగా ఉన్నప్పటికీ ఒక తోడు ఉన్నారనే నమ్మకం వారిలో కలుగుతుంది.

వాళ్ల అభిప్రాయాలను మీతో పంచుకోనివ్వండి. మాట్లాడేందుకు ఎ...