Hyderabad, ఏప్రిల్ 15 -- క్యాన్సర్ ఎందుకు వస్తుంది? అది ఇతరులకు వ్యాపిస్తుందా? క్యాన్సర్ వస్తే చివరికి మరణమేనా? ఇలాంటి సందేహాలు ప్రజల మనసుల్లో ఎన్నో ఉన్నాయి. వారిలో ఉన్న కొన్ని అపోహలు కూడా క్యాన్సర్ పట్ల భయాన్ని పెంచేస్తున్నాయి. క్యాన్సర్ గురించి ఉన్న తప్పుడు ఆలోచనలు, అపోహలే ఎన్నో అనర్ధాలకు దారితీస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మేము క్యాన్సర్ విషయంలో ప్రజల్లో ఉన్న అపోహలకు అసలైన వాస్తవాలను చెప్పాము. మేము చెప్పిన వాస్తవాలన్నీ కూడా సైన్స్ ఆధారిత సమాచారం నుంచి స్వీకరించినవి.

వాస్తవం: నిజానికి క్యాన్సర్ వస్తే ఇక మరణం ఒక్కటే మిగిలిందని ఎంతోమంది భావిస్తూ ఉంటారు. క్యాన్సర్ కు చికిత్స చేయడం సాధ్యమే. ఎందుకంటే ప్రారంభ దశలోనే క్యాన్సర్ ను గుర్తించి చికిత్స చేస్తే... చాలా వరకు క్యాన్సర్ కేసులు నయం అవుతాయి. కాబట్టి ప్రారంభ రోగ నిర్ధారణ, చికిత్స చాలా అవసరం. ...