Hyderabad, ఏప్రిల్ 10 -- క్యాన్సర్ రోగుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతుంది. వారికి చికిత్సను అందిస్తూ కూడా వారి శారీరక భావోద్వేగాలను పాజిటివ్ గా ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి పాలియేటివ్ కేర్ అందించాల్సిన అవసరం ఉంది.

తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి మానసిక మద్దతును, శారీరక సౌలభ్యాన్ని ఉపశమనాన్ని అందించే వైద్య సంరక్షణ ఇది. వారిలో జీవించాలన్న కోరికను పెంచుతుంది. పాలియేటివ్ కేర్ బృందంలో ఉన్న వైద్యులు, సహాయకులు, నర్సులు రోగికి ఎంతో సహాయంగా ఉంటారు.

క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి పాలియేటివ్ కేర్ ఎంతో ఉపయోగపడుతుంది. క్యాన్సర్ మాత్రమే కాదు తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్న ఇది వారి జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది. పాలీయేటివ్ కేర్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే అవగాహన ఉంది. దీని గురించి తెల...