భారతదేశం, డిసెంబర్ 15 -- కౌలు రైతులు కూడా తమకు ప్రభుత్వం తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అయితే ప్రభుత్వం తాజాగా వారికి గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీలో కౌలు రైతులకు రూ.లక్ష వరకు రుణం పొందవచ్చు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను మెుదలు పెట్టింది ప్రభుత్వం. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్‌లు) ద్వారా రుణాలు ఇవ్వనున్నారు.

ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర రుణాలు తీసుకుని.. అధిక వడ్డీని చెల్లిస్తూ ఇబ్బందులు పడుతున్నారు కౌలు రైతులు. పంట సాగు పెట్టుబడి కోసం రూ.లక్ష వరకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కౌలు రైతులను మరింత ప్రోత్సహించే ప్రణాళికలో భాగంగా అందజేయనుంది.

మీ ప్రాంతాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల నుంచి రుణాలను అందించనుంది ప్రభుత్వం. ప్రస్తుతం అధికారులు ఏపీ వ్యాప్తంగా కౌలు రైత...