భారతదేశం, నవంబర్ 14 -- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా టఫ్ ఫైట్ కొనసాగుతోంది. పోస్టల్ ఓట్ల నుంచి మూడు రౌండ్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం లభించింది. అయితే బీఆర్ఎస్ నుంచి కూడా గట్టి పోటీ కనిపిస్తోంది.

పోస్టల్ ఓట్లలో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యతను ప్రదర్శించగా. ఈవీఎం ఓట్ల మొదటి రౌండ్ లో కాంగ్రెస్ కు 40 ఓట్లకుపైగా లీడ్ లభించింది. అయితే రెండో రౌండ్ వచ్చే సరికి హస్తం హవా కొంచెం పెరిగింది. దాదాపు 1000 ఓట్ల లీడ్ రాగా.. మూడో రౌండ్ లో బీఆర్ఎస్ కు స్వల్ప మెజార్టీ దక్కింది. మూడో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ పార్టీనే ఆధిక్యంలో ఉంది.

మొత్తం జూబ్లీహిల్స్ లో 10 రౌండ్లు ఉన్నాయి. రౌండ్ రౌండ్ కు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ లో ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రతి రౌండ్ లోనూ ...