భారతదేశం, జనవరి 11 -- మంచనీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు బాదేసి, ఏదో ఈవ్ నింగ్ వాక్ కు వెళ్లినంత సులువుగా రికార్డులు తిరగరాసే విరాట్ కోహ్లి మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 28,000 పరుగుల మైల్ స్టోన్ చేరుకున్నాడు. ఇంటర్నెషన్ లో క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో సచిన్ తర్వాత సెకండ్ ప్లేస్ లో నిలిచాడు.

ఆదివారం (జనవరి 11) న్యూజిలాండ్ తో ఫస్ట్ వన్డేలో విరాట్ కోహ్లి అదరగొట్టాడు. ఛేజింగ్ లో 91 బంతుల్లో 93 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్లో 28,000 పరుగులకు చేరుకున్న మూడో ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు అత్యధిక పరుగుల లిస్ట్ లో సచిన్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. వన్డేల్లో వరుసగా అయిదో హాఫ్ సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో సచిన్ టెండూల్కర్ టాప్ ప్లేస్ లో...