భారతదేశం, నవంబర్ 7 -- ప్రస్తుతం భారత క్రికెట్‌లో అత్యంత ప్రముఖులుగా ఉన్న ముగ్గురు కీలక వ్యక్తులకు ఆస్ట్రేలియా లెజెండ్ స్టీవ్ వా కీలక సలహాలు ఇచ్చాడు. వన్డే భవిష్యత్తుపై అనిశ్చితి ఎదుర్కొంటున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతోపాటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్.. ఈ ముగ్గురికి కూడా స్టీవ్ వా కాస్త గట్టి సందేశమే ఇచ్చాడు. ఎవరూ ఆట కంటే గొప్పవాళ్లు కాదని, వాళ్లు ఆటను శాసించకూడదని అనడం గమనార్హం.

ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో ఒకడైన స్టీవ్ వాకు కూడా రెండు దశాబ్దాల కిందట ఇలాంటి అనుభవమే ఎదురైంది. అప్పటి ఆస్ట్రేలియా టీమ్ చీఫ్ సెలెక్టర్ ట్రెవర్ జోన్స్ కఠిన నిర్ణయం స్టీవ్ వాను షాక్ కు గురి చేసింది. అయితే ఆస్ట్రేలియా క్రికెట్‌కు అదే మంచిదని అతడు అర్థం చేసుకున్నాడు. ఈ రోజు కోహ్లీ, రోహిత్ కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. దీంతో ఈ ఇద్దరు...