భారతదేశం, మే 4 -- ్రిటన్ మహారాణి కిరిటంలో ఉన్న కోహినూర్ వజ్రం భారత్‌కు చెందినదని అందరికీ తెలుసు. కానీ ఇది భారత్ దగ్గర మాత్రం లేదు. దీనిపై ఎప్పటి నుంచో చర్చ ఉంది. చాలా మంది చాలా రకాలుగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అయితే దీనిపై తాజాగా బ్రిటన్ మంత్రి ఆసక్తికర కామెంట్స్ చేశారు. భారత్ పర్యటనలో భాగంగా దిల్లీకి వచ్చారు లీసా నాండీ. సాంస్కృతిక శాఖకు సంబంధించిన పలు ఒప్పందాల గురించి కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో చర్చలు జరుపుతున్నారు.

కోహినూర్‌ను భారత్‌కు తిరిగి ఇచ్చేస్తారా అనే ప్రశ్నకు బ్రిటన్ సాంస్కృతిక, మీడియా, క్రీడల మంత్రి లీసా నాండీ సమాధానమిచ్చారు. సాంస్కృతిక కళాఖండాలను పంచుకునేందుకు భారత్‌తో బ్రిటన్ చర్చలు జరుపుతోందని అన్నారు. అన్ని సరిగా జరిగితే.. అందరకీ ఆమోదయోగ్యమైన నిర్ణయం రావొచ్చని చెప్పారు.

అయితే లీసా నాండి కోహినూర్ భారత్‌కు తిరిగి ఇవ...