Hyderabad, ఏప్రిల్ 18 -- నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నువ్వుల లడ్డు ఇస్తే పిల్లలు తినడానికి ఇష్టపడరు. అలాంటి వారికి కోవా నువ్వుల లడ్డు చేసి ఇవ్వండి. దీనివల్ల వారికి నువ్వులు శరీరంలో చేరుతాయి. పైగా ఇది ఎంతో రుచిగా కూడా ఉంటుంది.

రోజుకొక కోవా నువ్వుల లడ్డు ఇస్తే వారికి కావలసిన పోషకాలు కూడా అందుతాయి. ఎందుకంటే ఇందులో మనం బెల్లం, బాదంపప్పు, నువ్వులు వేసి చేస్తాము. ఇంకెందుకు ఆలస్యం ఈ స్వీట్ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

కోవా - అరకప్పు

బాదం పప్పు - పది

బెల్లం తురుము - అర కప్పు

నువ్వులు అర కప్పు

నెయ్యి - రెండు స్పూన్లు

1. స్టవ్ మీద కళాయి పెట్టి తెల్ల నువ్వులను తీసుకొని వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి.

2. ఆ నువ్వులను చల్లార్చి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద మరొక కళాయి పెట్టి చిన్న మంట పెట్టాలి....