భారతదేశం, జనవరి 2 -- స్టాక్ మార్కెట్లో కొత్త ఏడాది జోరు కొనసాగుతోంది. ప్రభుత్వ రంగ దిగ్గజం, మహారత్న కంపెనీ అయిన 'కోల్ ఇండియా' (Coal India) షేర్లు శుక్రవారం (జనవరి 2, 2026) ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించాయి. విదేశీ కొనుగోలుదారులకు సంబంధించి కంపెనీ తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఈ భారీ లాభాలకు కారణమైంది. నేటి ఇంట్రాడే సెషన్‌లో కోల్ ఇండియా షేర్ ధర ఏకంగా 6 శాతానికి పైగా పెరిగి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది.

బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ వంటి పొరుగు దేశాలకు చెందిన బొగ్గు కొనుగోలుదారులు ఇకపై మన దేశంలో జరిగే బొగ్గు వేలంలో నేరుగా పాల్గొనవచ్చని కోల్ ఇండియా బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది.

జనవరి 1, 2026 నుంచే ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. ఆసక్తి ఉన్న విదేశీ కొనుగోలుదారులు ఇప్పుడు కోల్ ఇండియా నిర్వహ...