Hyderabad, ఏప్రిల్ 28 -- వేసవి కాలంలో చల్లని పానీయాలకు గిరాకీ ఎక్కువగానే ఉంటుంది. ఈ సీజన్‌లో చాలామంది తమ దాహాన్ని తీర్చుకోవడానికి శరబత్, పన్నీర్ సోడా, ఐస్ టీ వంటివి అధికంగా తాగుతుంటారు. అయితే, కాఫీ ప్రియులకు మాత్రం చల్లని కోల్డ్ కాఫీ ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. ఐస్, పాలు, కాఫీతో తయారు చేసుకునే ఈ పానీయం ఎంతో రుచికరంగా ఉంటుంది. ఐస్డ్ కాఫీ, కోల్డ్ బ్రూ, చాక్లెట్ కోల్డ్ కాఫీ ఇలా అనేక రకాలుగా దీన్ని తయారు చేసుకోవచ్చు.

అయితే చాలా మంది బాధపడే విషయం ఏంటంటే.. కోల్డ్ కాఫీని ఎన్ని సార్లు ట్రై చేసినా కెఫె స్టైల్ రుచి రాదు. మీరు కూడా ఇదే ఫీలింగ్ తో ఉన్నట్లయితే ఇకపై మీకా బాధ ఉండదు. ఈ సారి కోల్డ్ కాఫీని తయారు చేసటప్పుడు ఇక్కడున్న చిట్కాలను పాటించారంటే.. కెఫే లాంటి కోల్డ్ కాఫీ టేస్ట్ దిగిపోతుందంతే. ఇందుకోసం మీ పాటించాల్సిన సీక్రెట్ టిప్స్ ఏంటో చూసే...