Telangana,hyderabad, అక్టోబర్ 3 -- హైకోర్టు తీర్పును అనుసరించి రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామంలో ఆదిత్య కంపెనీ నిర్మాణ సంస్థకు అనుమ‌తుల్ని పున‌రుద్ధ‌రించామ‌ని హెచ్ఎండీఏ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింది. ఇందులో ఎలాంటి నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న జ‌ర‌గ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది.

2022లో ఆదిత్య కేడియా రియాల్టర్స్ సంస్థ రంగారెడ్డి జిల్లాలోని గండిపేట్ మండ‌లంలోని మంచిరేవుల గ్రామంలో 9.19 ఎక‌రాల్లో బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌న నిర్మాణానికి హెచ్ఎండీఏ అనుమ‌తిని జారీ చేసింది. అయితే. మూసీ నది బఫర్ జోన్ ను ఆక్రమించి అక్కడ రిటైనింగ్ వాల్ ను నిర్మించినట్లు 2023 జూలై 3న హెచ్ఎండిఏ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చేపట్టిన సంయుక్త తనిఖీలు తేలింది.

దీంతో 2023 ఆగ‌స్టు 2న ఆదిత్య కేడియా రియ‌ల్ట‌ర్స్ సంస్థకు హెచ్ఎండీఏ షోకాజ్ నోటీసును జారీ చేసింది. ఆ సంస్థ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగ...