భారతదేశం, ఏప్రిల్ 24 -- దీప అనుమ‌తి లేకుండానే ఆమె మెడ‌లో కార్తీక్ తాళి క‌ట్టాడ‌ని కోర్టులో లాయ‌ర్ క‌ళ్యాణ్ ప్ర‌సాద్ వాదిస్తాడు. క‌ట్టాడు కాదు దీప‌నే క‌ట్టించుకుంద‌ని జ్యోత్స్న లాయ‌ర్ భ‌గ‌వాస్ దాస్ ఆరోపిస్తాడు. ఇదంతా ప్రీ ప్లాన్‌డ్‌గా జ‌రిగింద‌ని అంటాడు. కార్తీక్‌కు, దీప‌కు ముత్యాల‌మ్మ గూడెంలో ఉన్న‌ప్పుడే ప‌రిచ‌యాలు ఉన్నాయ‌ని భ‌గ‌వాస్ దాస్ అంటాడు.

అవి ఎలాంటి ప‌రిచ‌యాలో తెలుసా అని క‌ళ్యాణ్ ప్ర‌సాద్ బ‌దులిస్తాడు. నేను ప‌రిచ‌యాలు ఉన్నాయ‌ని అన్నాను కానీ, అక్ర‌మ సంబంధం ఉంద‌ని అన‌లేద‌ని త‌క్కువ చేసి మాట్లాడుతాడు భ‌గ‌వాస్ దాస్‌. అత‌డి మాట‌ల‌తో దీప క‌న్నీళ్లు పెట్టుకుంటుంది.

జ్యోత్స్న పెళ్లి చేసుకోవాల్సిన మ‌నిషి చేత చాలా తెలివిగా త‌న మెడ‌లో తాళి క‌ట్టించుకునేలా దీప చేసింది. బావ‌ను ఇబ్బంది పెట్ట‌లేక‌, వ‌దులుకోలేక దీప ద‌గ్గ‌ర‌కు వెళ్లి జ్యోత్స్న‌ ...