భారతదేశం, డిసెంబర్ 12 -- శుక్రవారం రాగానే ఓటీటీలో సందడి కాస్త ఎక్కువగా ఉంటుంది. కొత్త సినిమాలు, సిరీస్ లు రిలీజ్ కు క్యూ కడతాయి. లాంగ్ వీకెండ్ కోసం మంచి ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు అలాగే ఓటీటీలో తెలుగులో వచ్చేసిన మూవీ 'సిస్టర్ మిడ్‌నైట్'. ఈ సినిమాలో రాధికా ఆప్టే లీడ్ రోల్ ప్లే చేసింది. ఇదో బ్లాక్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం

రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో నటించిన 'సిస్టర్ మిడ్‌నైట్' మూవీ తెలుగు ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది. ఇవాళ (డిసెంబర్ 12) నుంచి ఈ సినిమాను తెలుగు ఆడియన్స్ కూడా ఓటీటీలో ఎంజాయ్ చేయొచ్చు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే హిందీలో ఉన్న ఈ సినిమాకు తెలుగు, తమిళం డబ్బింగ్ యాడ్ చేశారు.

సిస్టర్ మిడ్‌నైట్ మూవీ మే 20, 2025న థియేటర్లలో రిలీజైంది. అక్కడ ఆడియన్స్ ను పెద్దగా అట్రాక్ట్ చ...