భారతదేశం, అక్టోబర్ 8 -- డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాయవరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాణసంచా పరిశ్రమలో పేలుడు జరిగి ఆరుగురు చనిపోయారు. మరికొందరికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగింది. ఈ కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అందులో ఉన్న ఆరుగురు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. చాలా మందికి గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని అనపర్తి ఆసుపత్రికి తరలించారు. మరికొందరిని ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్లారు.

అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలంలో సహయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 40 మంది వరకు కార్మికులు అందులో పనిచేస్తున్నట్టుగా తెలిసింది. పేలుడు భారీగా ఉండటంతో షెడ్డు గోడ కూడా కూలింది. అయితే ఆ శిథిలాల కింద మరికొందరు ఉండే అవక...