భారతదేశం, జనవరి 16 -- పచ్చని అందాలకు ఏపీలోని కోనసీమ ఎంతో ఫేమస్.! ఒక్కసారైనా ఇక్కడ గడపాలనుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. అయితే కోనసీమ అందాలను చూసేందుకు వీలుగా ఐఆర్సీటీసీ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. గోదావరి టెంపుల్ టూర్ ప్యాకేజీ పేరుతో హైదరాబాద్ ను ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ జనవరి నెలలోనే జర్నీ ఉంటుంది.

ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా కోనసీమలోని ప్రముఖ ఆలయాలతో పాటు మరికొన్ని ప్రాంతాలు చూడొచ్చు. అంతర్వేది, అన్నవరం, ద్రాక్షరామం వంటి ఆలయాలను దర్శించుకోవచ్చు. ప్రస్తుతం జనవరి 23వ తేదీన జర్నీ ఉంది. ఈ తేదీలో మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవాళ్లు https://www.irctctourism.com/ వెబ్ సైట్ నుంచి ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి.

టికెట్ ధరలు చూస్తే.. కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 15,340, డబుల్ షేరింగ్ కు ...