భారతదేశం, డిసెంబర్ 6 -- రెండు మూడు నెలల క్రితం కొబ్బరి ధరలు ఎంత పెరిగాయో.. ఇప్పుడు అంతకుఅంత తగ్గుతున్నాయి. గత 15 రోజుల్లో చూసుకుంటే.. కొబ్బరికాయల ధరలు సుమారు 50 శాతానికి పైగా పడిపోయాయి. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమిళనాడులో పంట బాగా పండడమే డిమాండ్ తగ్గడానికి, ధరలు పతనానికి ముఖ్యమైన కారణంగా కనిపిస్తోంది.

ధరలు మరింత తగ్గడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. పండుగ సీజన్ కూడా ముగిసింది. నిజానికి కార్తీక మాసంలో కోనసీమ నుంచి పెద్ద ఎత్తున కొబ్బరి ఎగుమతి అయింది. దీపావళి, కార్తీక మాసం అయిపోవడం, మరోవైపు శుక్ర మౌఢ్యమి కారణంగా ధరలు దారుణంగా పడిపోయాయి. మరోవైపు కేరళ, తమిళనాడులో అధిక దిగుబడి కూడా కోనసీమ కొబ్బరి మార్కెట్ మీద ప్రభావం చూపిస్తోంది. సంక్రాంతి సీజన్ వరకు కొబ్బరి ధరల్లో పెరుగుదల ఉండకపోవచ్చు. అప...