Hyderabad, జూన్ 29 -- శ్రీ వేంకటేశ్వరుని బాల్యక్రీడలను శ్రీ వకుళమాత చూసి తరించిన స్థలమే 'అప్పనపల్లి క్షేత్రం'. పుణ్యభూమిగా పేరొందిన మన దేశంలో గల దివ్యక్షేత్రాలలో అప్పనపల్లి క్షేత్రం పురాతనమైనదిగా ప్రసిద్ధి చెందింది. శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ బాల బాలాజీ స్వామివారిని సేవించటం పుణ్యప్రదం, ఫలప్రదం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

శ్రీ కశ్యప ప్రజాపతికి కద్రువ, వినత అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. కద్రువ పిల్లలు నాగులు. వినత కుమారుడు వైనతేయుడు. కొన్ని కారణాల వల్ల వైనతేయుడు నాగులను రోజుకోటి తినేవాడు. శంఖచూడుడనే నాగును కాపాడటానికి జీమూతవాహనుడనే విద్యాధర చక్రవర్తి బలయ్యాడు. జీమూతవాహనుడు దేహార్పణ చేసిన ప్రాంతం కనుక, ఆ ప్రాంతానికి "అర్పణఫలి" అని పేరు వచ్చింది. అదే క్రమంగా 'అప్పనపల్లి' అయ్యింద...