భారతదేశం, డిసెంబర్ 23 -- సూర్యాపేట జిల్లాలో దళిత యువకుడు కర్ల రాజేశ్ కస్టడీ మరణంపై వివరణాత్మక నివేదికను సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. ఈ కేసులో మానవ హక్కుల ఉల్లంఘన ఉందని గుర్తించింది కమిషన్.. అక్రమ నిర్బంధం, కస్టడీలో హింస, యువకుడి కస్టడీ మరణంపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా పరిగణించింది.

మృతుడి తల్లి కర్ల లలిత, మంద కృష్ణ మాదిగతోపాటుగా మరికొందరు సమర్పించిన ఫిర్యాదుల ఆధారంగా కమిషన్ నిర్ణయం తీసుకున్నది. మృతుడిని చిల్కూరు, కోదాడ గ్రామీణ పోలీసులు చట్టవిరుద్ధంగా నిర్బంధించారని, థర్డ్ డిగ్రీ చేశారని, తప్పుడుగా ఇరికించారని, కుటుంబ సభ్యులను కలవడానికి అనుమతి నిరాకరించారని మానవ హక్కుల కమిషన్ గుర్తించినట్టుగా తెలుస్తోంది. తరువాత, ఆ వ్యక్తిని సబ్-జైలు నుండి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత నవంబర్ 16న తీవ్ర గాయాలతో మరణించాడ...