భారతదేశం, డిసెంబర్ 4 -- తెలంగాణలో ప్రస్తుతం కోతుల సమస్య గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. చాలా గ్రామాల్లో సర్పంచ్‌ని గెలిపించాలంటే ఈ సమస్యను తీర్చాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు. పట్టణాల్లోనూ కోతుల బెడద ఎక్కువగానే ఉంది. హైదరాబాద్‌ సిటీలోనూ కోతుల సమస్య బాగా ఉంది. తాజాగా ఈ సమస్యను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్లమెంటులో ప్రస్తావించారు. లోక్‌సభ జీరో అవర్‌లో మాట్లాడారు.

తెలంగాణతోపాటుగా దేశంలో అనేక రాష్ట్రాల్లో కోతుల సమస్య ఉందని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ సమస్య తమ శాఖ కిందకు రాదని ప్రభుత్వ శాఖలు తప్పించుకుంటున్నాయని చెప్పారు. కోతుల సమస్య ఏ శాఖ కిందకు వస్తుందో చెప్పాలని అడిగారు.

'కోతుల సమస్యతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెద్ద మెుత్తం వానరాలు పంటలను పాడు చేస్తున్నాయి. ఈ సమస్యను నివారించేందుకు జాతీయ స్థాయిలో...