భారతదేశం, జనవరి 11 -- ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి వేడుకలు అనగానే వెంటనే గుర్తొచ్చేది కోడిపందేలు. ఈ సంప్రదాయం ప్రతి సంవత్సరం అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది. పొరుగు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా విదేశాలలో స్థిరపడిన వారు కూడా ఈ పోటీలను చూడటానికి పండుగ సమయంలో తమ స్వగ్రామాలకు తిరిగి వస్తారు. కోడిని జాగ్రత్తగా సెలక్ట్ చేసుకోవడం, ప్రత్యేక శిక్షణ ఇవ్వడం నుండి కఠినమైన ఆహారం, ఫైట్ వరకు.. కోడి జీవితంలోని ప్రతి అంశాన్ని పద్ధతి, ప్లానింగ్ ప్రకారం చూస్తారు.

ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలు ముఖ్యంగా కోడి పందేలకు ప్రధాన కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇది సంక్రాంతి పండుగ సమయంలో సాంప్రదాయ గ్రామీణ క్రీడగా ప్రారంభమైంది. కానీ ఇప్పుడు సంక్రాంతి పండుగ రోజుల్లో కోట్ల రూపాయల పందేలతో కూడిన పెద్ద ఎత్తున జూదంగా మారింది. ఇదే అసలు సమస్యగా మారింది....