భారతదేశం, ఫిబ్రవరి 23 -- టాలీవుడ్ స్టార్ కపుల్ రష్మిక, విజయ్ పెళ్లి ఈ గురువారమే అంటే ఫిబ్రవరి 26న జరగబోతోంది. ఈ నేపథ్యంలో వీళ్ల లవ్ స్టోరీ జర్నీ, విజయ్ పేరెంట్స్ తమ కాబోయే కోడలికి ఉండాల్సిన లక్షణాల గురించి మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విజయ్ తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవి.. తమ డ్రీమ్ కోడలు ఎలా ఉండాలో చెబుతూ మాట్లాడిన ఒక పాత వీడియోను అభిమానులు వైరల్ చేస్తున్నారు.

2018లో జరిగిన 'గీత గోవిందం' సక్సెస్ మీట్‌లో యాంకర్ సుమ.. విజయ్ తల్లిదండ్రులతో మాట్లాడుతూ అతని పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. మీకు ఎలాంటి కోడలు రావాలని మీరు కలలు కంటున్నారని మాధవిని సుమ అడిగినప్పుడు.. ఆమె తనకు ఒకే ఒక కండిషన్ ఉందని బదులిచ్చారు.

"మా బాబుని మంచిగా చూసుకునే కోడలు వస్తే చాలు. ఆమె అతన్ని బేషరతుగా ప్రేమించాలి అంతే. అతను సినిమా ఇండస్ట్రీలో ...