భారతదేశం, జూలై 13 -- 83 ఏళ్ల వయసులో కోట శ్రీనివాస రావు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఈ రోజు ఆయన హైదరాబాద్ లోని తన ఇంట్లో కన్నుమూశారు. సుమారు 750కి పైగా చిత్రాల్లో నటించారు కోట. అయితే ముఖ్యంగా బాబు మోహన్ తో ఆయన కాంబినేషన్ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. పాత సినిమాల్లో కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ కలిసి చేసిన కామెడీ చిరస్థాయిగా మిగిలిపోతుంది. ఎటువంటి డబుల్ మీనింగ్ లు, అసహ్యాలు లేకుండా ప్యూర్ కామెడీ అందించారు ఈ దిగ్గజాలు.

తన తోటి నటుడు, తనను సొంత తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకున్న కోట శ్రీనివాస రావు ఇక లేరు అని వార్త తెలిసి బాబు మోహన్ కుంగిపోయారు. కోట శ్రీనివాస రావు భౌతిక కాయాన్ని చూసిన తర్వాత కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆ వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

''మొన్ననే కాల్ చేశా. ఎప్పుడొస్తావ్ రా అన్నాడు. రేపొస్త...