భారతదేశం, జూలై 13 -- ఆదివారం తెలుగు చలన చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 83 ఏళ్ల వయసులో కోట శ్రీనివాసరావు మరణ వార్తతో ఇండస్ట్రీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. గత మూడు సంవత్సరాలుగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో జూలై 13, 2025న మరణించారు. ఈ రోజు కోట మరణం చాలా మందికి షాక్ కలిగించింది. కోట శ్రీనివాస రావు చివరగా పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లులో నటించారు.

చిరంజీవి, బ్రహ్మానందం వంటి నటులు కోట శ్రీనివాస రావుకు ఘన నివాళులు అర్పించారు. కోట 750 కంటే ఎక్కువ చిత్రాలలో నటించారు. ఇటీవలి సంవత్సరాలలో నటనను ఆపేశారు. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసమే హరిహర వీరమల్లులో యాక్ట్ చేసేందుకు ఒప్పుకున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కోట వెల్లడించారు.

ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెండు రోజు...