Hyderabad, జూలై 14 -- తెలుగు లెజండరీ నటుడు కోట శ్రీనివాసరావు మరణం టాలీవుడ్ ఇండస్ట్రీని శోకసంద్రంలోకి నెట్టివేసింది. జులై 13న సాయంత్రం కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు జరిగాయి. అయితే, సినీ సెలబ్రిటీలు, అభిమానుల సందర్శనార్థం కోట శ్రీనివాసరావు పార్థివదేహాన్ని ఆయన నివాసంలో ఉంచారు.

అగ్ర తారలు, నటీనటులు కోట శ్రీనివాసరావు పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం మీడియా ముందుకు వచ్చి కోట గురించి గొప్పగా చెప్పారు. ఈ క్రమంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సైతం కోట శ్రీనివాసరావుకు నివాళులు అర్పించాడు. కోట గురించి చెప్పడానికి విలేకరుల ముందుకు వచ్చాడు తారక్.

అయితే, కోట శ్రీనివాసరావు గురించి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతుండగా ఆయన అభిమానులు జై ఎన్టీఆర్.. జై ఎన్టీఆర్ నినాదాలు చేశారు. అదే పనిగా ఫ్యాన్స్ నినాదాలు చేసేసరికి జూనియర్ ఎన్టీఆర్‌కు కోపం ...