Hyderabad, జూన్ 19 -- మంచు విష్ణు నటించిన లేటెస్ట్ తెలుగు మైథలాజికల్ మూవీ కన్నప్ప. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ దర్శకత్వం వహించిన కన్నప్ప సినిమాలో మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, శివరాజ్ కుమార్, కాజల్ అగర్వాల్, మధుబాల వంటి అగ్ర తారలు నటించారు.

వీరితోపాటు కన్నప్ప సినిమాలో పిలక-గిలక అనే పాత్రల్లో కమెడియన్స్ బ్రహ్మానందం, సప్తగిరి యాక్ట్ చేశారు. అయితే, ఇదే కన్నప్ప మూవీపై బ్రహ్మాణ సంఘాలు ఆగ్రహానికి గురవడానికి కారణం అయింది. బ్రహ్మణులను కించపరచడానికే అలాంటి హాస్య పాత్రలు రూపొందించారని అభ్యంతరం వ్యక్తం చేశాయి.

ఈ వివాదంపై కన్నప్ప మూవీ రైటర్ ఆకెళ్ల శివ ప్రసాద్ స్పందించారు. "నేను ఒక బ్రహ్మణుడిని. కన్నప్ప మూవీ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ కూడా నార్ ఇండియాకు చెందిన బ్రాహ్మణుడే. బ్రహ్మణులును కానీ ఇతర వేరే కమ్యునిటీ వా...